తెలంగాణలో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు
తెలంగాణలో న్యూఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. రాష్ట్రవ్యాప్తంగా న్యూఇయర్ వేడుకలకు అనుమతి లేదన్న పోలీసులు ఈవెంట్స్, పబ్స్, డ్యాన్స్ ఫ్లోర్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్‌పై ప్రత్యేక నిఘా పెట్టడంతోపాటు 100 టీమ్స్‌తో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక, రేపు రాత్రి 11గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6గంటల వరకు ఫ్లైఓవర్లు మూసివేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లతోపాటు ఔటర్ రింగ్ రోడ్ కూడా క్లోజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Next Story




