Coronavirus: తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉండదు- సీఎం కేసీఆర్‌

Coronavirus: తెలంగాణలో ఎట్టి పరిస్థితిలోనూ లాక్‌డౌన్ ఉండదని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తేల్చి చెప్పారు.

Arun Chilukuri
Updated on: 26 March 2021 2:35 PM IST
No Lockdown Plan in Telangana, Says CM KCR
X

Coronavirus: తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉండదు- సీఎం కేసీఆర్‌

Coronavirus: తెలంగాణలో ఎట్టి పరిస్థితిలోనూ లాక్‌డౌన్ ఉండదని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తేల్చి చెప్పారు. లాక్‌డౌన్‌తో ఇప్పటికే ప్రజలు ఇబ్బందులు పడ్డారని మళ్లీ అలాంటి పరిస్థితులు రానివ్వమన్నారు. లాక్‌డౌన్ పై తొందరపడి నిర్ణయాలు తీసుకోమని ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్కూల్స్‌ మూసివేసామని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది తాత్కాలికమే అన్నారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. కరోనాను నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు.

తెలంగాణలో కరోనా టెస్టుల సంఖ్యను పెంచామన్నారు సీఎం కేసీఆర్‌. ఇప్పటికే 10లక్షల 85వేల మందికి వ్యాక్సినేషన్‌ ఇచ్చామన్నారు ఆ‍యన. వ్యాక్సిన్‌ ఇచ్చే అంశం కేంద్రం పరిధిలో ఉందన్న సీఎం కేసీఆర్‌ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థలకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించామన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story