Yellandu: ఇల్లందు మున్సిపల్ చైర్మన్‌పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

No Confidence Motion Against Yellandu Chairman Dismissed
x

Yellandu: ఇల్లందు మున్సిపల్ చైర్మన్‌పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

Highlights

Yellandu: ఇల్లందు మున్సిపల్ చైర్మన్‌ వెంకటేశ్వర్లుపై వేసిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.

Yellandu: ఇల్లందు మున్సిపల్ చైర్మన్‌ వెంకటేశ్వర్లుపై వేసిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. దీంతో మున్సిపల్ చైర్మన్‌గా వెంకటేశ్వర్‌ తిరిగి కొనసాగనున్నట్లు ఎన్నికల అధికారి కొత్తగూడెం ఆర్డిఓ శిరీష ప్రకటించారు. మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం కోరుతూ కొందరు కౌన్సిలర్లు వినతితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇల్లందు పురపాలక పాలకవర్గంలో చైర్మన్ తో సహా మొత్తం 24 మంది సభ్యులు ఉన్నారు. కౌన్సిల్‌లో తగినంత మంది సభ్యులు లేకపోవడంతో అవిశ్వాసం వీగిపోయింది.

ఇప్పటికే మున్సిపల్ చైర్మన్, నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మరో ఇద్దరు మంత్రులకు ఇల్లందు మున్సిపల్ ప్రత్యేక సమావేశం సవాల్‌‌గా తీసుకున్నారు. మున్సిపల్ చైర్మన్‌తో సహా బిఆర్ఎస్ నుంచి గెలిచిన 19 మంది సభ్యులకు బిఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ విప్ జారీ చేశారు. ప్రత్యేక సమావేశం నేపథ్యంలో ఇల్లందులో 144 సెక్షన్ విధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories