Nizamabad: బాల్కొండలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్‌ కృష్ణారెడ్డి

Nizamabad: బాల్కొండలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్‌ కృష్ణారెడ్డి
x

Nizamabad: బాల్కొండలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్‌ కృష్ణారెడ్డి

Highlights

తెలంగాణలో జరుగుతున్న మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నిజామాబాద్ జిల్లాలో అత్యంత ప్రశాంతంగా కొనసాగుతోంది.

తెలంగాణలో జరుగుతున్న మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నిజామాబాద్ జిల్లాలో అత్యంత ప్రశాంతంగా కొనసాగుతోంది. బుధవారం బాల్కొండ మండల కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి స్వయంగా సందర్శించి, ఎన్నికల సరళిని పరిశీలించారు.

అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా మూడో విడతలో భాగంగా 149 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ఓటర్లు ఉదయం నుంచే ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని, ఉదయం 9 గంటల సమయానికే జిల్లాలో 23 శాతం ఓటింగ్ నమోదైందని ఆయన వెల్లడించారు.

ఎన్నికల నిర్వహణకు సంబంధించి యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని కలెక్టర్ స్పష్టం చేశారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ సమయం ఉండగా, ఆ సమయానికి క్యూలైన్‌లో ఉన్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

పోలింగ్ ముగిసిన వెంటనే.. అంటే మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్ వివరించారు. ఫలితాల ప్రకటన అనంతరం అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు ప్రజాస్వామ్య బద్ధంగా తమ ప్రతినిధులను ఎన్నుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories