Nizamabad: పసుపు రైతులకు చెప్పినదాని కంటే ఎక్కువే కేంద్రం చేసింది- ఎంపీ అర్వింద్

Nizamabad: తమిళనాడు బీజేపీ మేనిఫెస్టోపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ స్పందించారు.

Arun Chilukuri
Published on: 25 March 2021 7:30 PM IST
Nizamabad MP Aravind Respond Tamil Nadu BJP Manifesto
X

Nizamabad: పసుపు రైతులకు చెప్పినదాని కంటే ఎక్కువే కేంద్రం చేసింది- ఎంపీ అర్వింద్

Nizamabad: తమిళనాడు బీజేపీ మేనిఫెస్టోపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ స్పందించారు. నిజామాబాద్ పసుపు రైతులకు ఆశించిన స్థాయి కంటే కూడా కేంద్రం ఎక్కువే చేసిందన్నారు. పసుపు రైతుల కోసం స్పైసెస్‌ ఎక్స్‌టెన్షన్‌ బోర్డు కూడా ఏర్పాటు చేశారన్నారు. దిగుమతులు తగ్గించి ఎగుమతులు పెంచామని అర్వింద్ వెల్లడించారు. ప్రతి ఏడాది బడ్జెట్‌ని పది కోట్ల రూపాయలకు పెంచమన్నారు. పసుపు రైతులకు మద్దతు ధరకు మించి రేటు ఇస్తున్నామన్నారు. క్వాలిటీ పసుపు పదివేలకు పైగానే ధర పలుకుతుందన్నారు. కేసీఆర్, కేటీఆర్ రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు ఎంపీ అర్వింద్.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story