Nizamabad Mayor Election 2026: నిజామాబాద్‌లో బీజేపీ సంచలన నిర్ణయం.. మేయర్ రేసు నుంచి...

Nizamabad Mayor Election 2026: ఇందూరు రాజకీయాల్లో మేయర్ పీఠంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది.

Arun Chilukuri
Published on: 14 Feb 2026 2:59 PM IST
Nizamabad Mayor Election 2026: నిజామాబాద్‌లో బీజేపీ సంచలన నిర్ణయం.. మేయర్ రేసు నుంచి...
X

Nizamabad Mayor Election 2026: ఇందూరు రాజకీయాల్లో మేయర్ పీఠంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ, మేజిక్ ఫిగర్ సాధించలేకపోవడంతో నిజామాబాద్ కార్పొరేషన్‌లో తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని భారతీయ జనతా పార్టీ (BJP) స్పష్టం చేసింది. దీంతో మేయర్ పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి మార్గం సుగమమైంది.

హంగ్ ఫలితాలు.. ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు:

నిజామాబాద్‌లోని మొత్తం 60 డివిజన్లలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు.

బీజేపీ: 28 స్థానాలు

కాంగ్రెస్: 17 స్థానాలు

ఎంఐఎం: 14 స్థానాలు

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. "మాకు మెజారిటీ రాలేదు కాబట్టి గౌరవంగా ప్రతిపక్షంలో ఉంటాం. అయితే, ఈ మేయర్ పదవీకాలం ముగిసేలోపు నిజామాబాద్ పేరును **'ఇందూరు'**గా మార్చేందుకు ప్రయత్నిస్తాం" అని ప్రకటించారు. అలాగే ఆర్మూర్‌లో ఆశించిన ఫలితాలు రాకపోవడంపై విశ్లేషణ చేస్తామని చెబుతూ ప్రజలకు క్షమాపణలు తెలిపారు.

కాంగ్రెస్ క్యాంప్ పాలిటిక్స్:

మరోవైపు, ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎంఐఎం నేతల మద్దతు కోరారు. 17 సీట్లున్న కాంగ్రెస్‌కు ఎంఐఎం (14) తోడైతే సులభంగా మేయర్ పీఠం దక్కుతుంది. ఈ క్రమంలో కార్పొరేటర్లు చేజారకుండా కాంగ్రెస్ క్యాంప్ పాలిటిక్స్‌ను షురూ చేసింది. ఎక్స్ అఫీషియో ఓట్ల పరంగా కూడా ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఉండటం కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశం.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story