ఉగ్రపోరులో నిజామాబాద్ జిల్లా జవాన్ వీరమరణం

Terror Attack at Jammu & Kashmir : జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మాచిల్ సెక్టారు వద్ద చొరబాటుదార్లకు,...
Terror Attack at Jammu & Kashmir : జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మాచిల్ సెక్టారు వద్ద చొరబాటుదార్లకు, భద్రత బలగాలకు జరిగిన కాల్పుల్లో తెలంగాణ జవాన్ ర్యాడా మహేష్ వీరమరణం పొందారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమాన్ పల్లి గ్రామానికి చెందిన మహేష్ గత ఆరు సంవత్సరాలుగా ఆర్మీలో పని చేస్తున్నాడు. మొదట మహేష్ కు తీవ్ర గాయాలు అయినట్లు ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తర్వాత కాల్పుల్లో మహేష్ మరణించారని తెలపడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
కోమన్‌పల్లి గ్రామానికి చెందిన ర్యాడా గంగమల్లు, రాజుకు ఇద్దరు కొడుకులు. వీరిది వ్యవసాయ ఆధారిత కుటుంబం. పెద్ద కొడుకు ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లారు. చిన్నకొడుకు మహేష్ ఆర్మీలో చేరాలన్న లక్ష్యంతో చదివి 2014-15లో ఉద్యోగానికి ఎంపికయ్యారు. నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్ చదివిన మహేష్.. కరీంనగర్‌లో ఓ పోటీ పరీక్షల కేంద్రంలో శిక్షణ తీసుకుని సైనిక ఉద్యోగానికి ఎంపికయ్యారు. శిక్షణ ముగిశాక అసోంలో అనంతరం డెహ్రడూన్‌లో బాధ్యతలు నిర్వర్తించారు. రెండేళ్ల కిందట హైదరాబాద్ కు చెందిన ఆర్మీ కమాండర్ కూతురు సుహాసినిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. గత ఏడాది డిసెంబరులో స్వగ్రామానికి వచ్చిన మహేష్ అదే నెలలో తిరిగి విధులకు బయలుదేరారు.
జమ్ము కశ్మీర్‌లో విధులు నిర్వహించాల్సి రావడంతో మొదట అక్కడ పరిస్థితులు బాగా లేవని, జాగ్రత్తగా ఉండాలని చెప్పేవారని మహేష్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈనెల 2వ తేదీన పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించేందుకు తోటి జవాన్లతో వెళ్తున్నానని వచ్చాక ఫోన్ చేస్తానని మహేష్ తల్లిదండ్రులతో చెప్పాడు. అవే చివరి మాటలు అయ్యాయని కుటుంబసభ్యులు రోదిస్తున్నారు.
మాచిల్ సెక్టార్ లో బోర్డర్ లో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు నిఘా ఉంచాయి. చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47 తుపాకీ, రెండు బ్యాగులను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా ఎదురు కాల్పులకు దిగారు. కాల్పుల్లో కెప్టెన్ సుదీప్ సర్కార్, ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడులో హై వోల్టేజ్ రాజకీయాలు
13 Aug 2022 3:45 AM GMTMilk Facts: పాలు తాగితే బరువు పెరుగుతారా.. తగ్గుతారా..!
13 Aug 2022 3:17 AM GMTకాంగ్రెస్‌లో ఆపరేషన్ మునుగోడు ప్రారంభం
13 Aug 2022 2:32 AM GMTఅక్కపై తమ్ముడి విలువైన ప్రేమ
13 Aug 2022 2:04 AM GMTమునుగోడుపై బీజేపీ యాక్షన్ ప్లాన్
13 Aug 2022 1:47 AM GMT