Superintendent Resigns over Corona Issues : నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజీనామా

Arun Chilukuri
Updated on: 13 July 2020 2:51 PM IST
Superintendent Resigns over Corona Issues : నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజీనామా
X

Superintendent Resigns over Corona Issues : నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వరరావు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రొఫెసర్‌గా కొనసాగుతానని ఆయన ప్రకటించారు. ఆసుపత్రిలో జరుగుతున్న వరుస సంఘటనల కారణంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల కిందట నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందకపోవడంతో నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. వీరిలో ముగ్గురు కరోనా బాధితులు. దీంతో వైద్య సేవల నిర్లక్ష్యంపై ఆరోగ్యశాఖ అధికారులు ఆయనపై సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది.

ఇది జరిగిన తర్వాత రోజే ఆటోలో శవాన్ని తరలించే విషయం కూడా వివాదాస్పదంగా మారింది. ఇది కూడా సూపరింటెండెంట్ మెడకు చుట్టుకుంది. దీనిపైనా జిల్లా కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో నాగేశ్వరరావు రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. ఈ రోజు ఆయన జిల్లా కలెక్టర్‌తో పాటు వైద్య అధికారులను కలిసి తన రాజీనామా లేఖను అందించనున్నట్టు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story