Riyaz Funeral: నిజామాబాద్‌ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు.. నిందితుడు రియాజ్ అంత్యక్రయలు పూర్తి

Riyaz Funeral: నిజామాబాద్‌లో CCS కానిస్టేబుల్‌ హత్య కేసులో నిందితుడు రియాజ్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Arun Chilukuri
Published on: 21 Oct 2025 12:23 PM IST
Riyaz Funeral: నిజామాబాద్‌ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు.. నిందితుడు రియాజ్ అంత్యక్రయలు పూర్తి
X

Riyaz Funeral: నిజామాబాద్‌ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు.. నిందితుడు రియాజ్ అంత్యక్రయలు పూర్తి

Riyaz Funeral: నిజామాబాద్‌లో CCS కానిస్టేబుల్‌ హత్య కేసులో నిందితుడు రియాజ్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. తెల్లవారుజామున రియాజ్‌ బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు..

గత 17న వాహనాల దొంగతనం కేసులో రియాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తరలిస్తుండగా, కానిస్టేబుల్‌ ప్రమోద్‌పై కత్తితో దాడి చేసి పరారైన విషయం తెలిసిందే. 48 గంటల్లోనే సారంగాపూర్‌ వద్ద పోలీసులు రియాజ్‌ను పట్టుకున్నారు. అయితే, అరెస్ట్‌ సమయంలో మరో యువకుడిపై కూడా రియాజ్‌ కత్తితో దాడి చేసినట్లు సమాచారం. తరువాత జిల్లా ఆసుపత్రి ఖైదీల వార్డులో చికిత్స పొందుతున్న సమయంలో రియాజ్‌ తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. భద్రత కోసం ఉన్న కానిస్టేబుల్‌ వెపన్‌ను లాక్కుని ట్రిగ్గర్‌ నొక్కే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story