Nizamabad: నిజామాబాద్ బీఆర్ఎస్ లోకసభ ఎన్నికల సన్నాహక సమావేశం

Nizamabad: నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి

Shashank Gullapelli
Published on: 7 April 2024 5:41 PM IST
Nizamabad BRS Lok Sabha Election Meeting
X

Nizamabad: నిజామాబాద్ బీఆర్ఎస్ లోకసభ ఎన్నికల సన్నాహక సమావేశం

Nizamabad: ధర్మపురి అరవింద్‌ను నిజామాబాద్ ఎంపీగా ఇక్కడి ప్రజలు గెలిపిస్తే పసుపు బోర్డు తేలేదని, పసుపు బోర్డు ఎక్కడ పెట్టారో చూపించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో జరిగిన నిజామాబాద్ BRS లోకసభ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆ‍యన మాట్లాడారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ హాజరయ్యారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో నాయకులకు, కార్యకర్తలకు వేముల ప్రశాంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తానని చెప్పిందని.. కానీ 100 రోజులు పూర్తయినా ఇంకా హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారాయన..

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story