ఇందూరు గడ్డ.. గుట్కా అడ్డా

ఇందూరు గడ్డ.. గుట్కా అడ్డా
x
Highlights

గుట్కా అక్రమ రవాణా తయారీకి కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది ఆ జిల్లా. కొందరు వ్యాపారులు ఆ గడ్డను అడ్డాగా చేసుకుని అక్రమ వ్యాపారానికి తెరలేపారు. అధికార...

గుట్కా అక్రమ రవాణా తయారీకి కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది ఆ జిల్లా. కొందరు వ్యాపారులు ఆ గడ్డను అడ్డాగా చేసుకుని అక్రమ వ్యాపారానికి తెరలేపారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. మహారాష్ట్ర-కర్ణ్నాటక నుంచి నిషేధిత గుట్కా, తంబాకు విచ్చల విడిగా రవాణా అవుతోంది. నెల వ్యవధిలో టాస్క్ పోర్స్ , సివిల్ పోలీసుల దాడుల్లో అరకోటి విలువైన గుట్కా పట్టు బడింది. పోలీసులు దాడులు చేస్తున్నా దందా మాత్రం ఆగడం లేదు.

నిజామాబాద్ జిల్లాలో గుట్కా దందా జోరుగా సాగుతోంది. కరోనా సమయంలో గుట్కా వ్యాపారులు నిషేదిత గుట్కా, తంబాకు పెద్ద ఎత్తున నిల్వ చేసి మారుమూల పల్లెలలకు రవాణా చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో నిషేధిత గుట్కాల అమ్మకాలు పెరగడంతో నిల్వలు సైతం భారీగా చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్, కర్ణ్నాటకలోని గుల్బర్గా ప్రాంతాల నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. తంబాకు గుట్కాలను ప్రభుత్వం నిషేధించినా అధికార పార్టీ నేతలను అడ్డం పెట్టుకొని జోరుగా వ్యాపారం సాగిస్తున్నారు. అడపా దడపా గుట్కా కేంద్రాలు, తంబాకు తయారీ పరిశ్రమలపై పోలీసులు దాడులు చేస్తున్నా దందా మాత్రం ఆగడం లేదు. సుమారు అరకోటి విలువ చేసే గుట్కా, తంబాకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

టాస్క్ పోర్స్ పోలీసులు దాడులుచేసి భారీగా గుట్కా నిల్వలు పట్టుకుని, తంబాకు తయారీ కేంద్రాలను సీజ్ చేశారు. ఎంత పెద్ద వారు ఈ వ్యాపారం వెనుక ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల కనుసన్నల్లో కొందరు ఈ అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గుట్కా కేంద్రాలపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా అసలు సూత్ర ధారులు మాత్రం పట్టుబడటం లేదు. ఇప్పటికైనా పోలీసులు గుట్కా కింగ్ లపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories