Nizamabad: నిజామాబాద్‌ జిల్లా నందిపేటలో కరోనా కలకలం

Nizamabad: కంఠం గ్రామంలో 43 మందికి కోవిడ్‌ పాజిటివ్ * గత నెల 30న కంఠం గ్రామంలో ఓ శుభకార్యం

Sandeep Eggoju
Updated on: 7 Jun 2021 12:18 PM IST
Nizamabad: 43 Members Tested Corona Positive in Kantham Village
X

Representational Image

Nizamabad: నిజామాబాద్‌ జిల్లా నందిపేటలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కంఠం గ్రామంలో గత నెల 30న ఓ కుటుంబం శుభకార్యం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర నుంచి కూడా బంధువులు తరలివచ్చారు. రెండు రోజుల తర్వాత శుభకార్యం నిర్వహించిన కుటుంబంలో కొందరికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో టెస్ట్ చేయించగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇక ఇదే శుభకార్యానికి హాజరైన గ్రామస్తుల్లో కూడా కొందరు కరోనా బారిన పడ్డట్టు తెలుస్తోంది. దీంతో మొత్తం కంఠం గ్రామంలో 43 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా వారిని హోం ఐసోలేషన్‌కు తరలించారు అధికారులు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story