Nirudyoga Diksha: టీబీజేపీ ఆఫీస్‌లో బండి సంజయ్‌ నిరుద్యోగ దీక్ష

Nirudyoga Diksha: దీక్షలో పాల్గొన్న తరుణ్‌చుగ్‌, ఈటల, విజయశాంతి

Sandeep Eggoju
Published on: 27 Dec 2021 2:43 PM IST
Nirudyoga Diksha of Bandi Sanjay Kumar at Telangana BJP Party Office | TS News Online
X

 టీబీజేపీ ఆఫీస్‌లో బండి సంజయ్‌ నిరుద్యోగ దీక్ష

Nirudyoga Diksha: హైదరాబాద్‌ బీజేపీ కార్యాలయంలో తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ నిరుద్యోగ దీక్ష కొనసాగుతోంది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ టీబీజేపీ డిమాండ్‌ చేస్తోంది. సాయంత్రం 4 గంటల వరకు సాగే ఈ దీక్షలో బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్‌ తరుణ్‌చుగ్‌తో పాటు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, బీజేపీ నాయకురాలు విజయశాంతి పాల్గొన్నారు. నిరుద్యోగులను సీఎం కేసీఆర్‌ మోసం చేశారని విమర్శించారు తరుణ్‌చుగ్‌. ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబానికి తప్ప ఎవరికీ న్యాయం జరగలేదని ఆయన ఆరోపించారు.

ఉద్యమ ద్రోహులకు టీఆర్‌ఎస్‌ పెద్దపీట వేస్తోందన్న తరుణ్‌చుగ్‌ మోడీ హయాంలో దేశానికి భారీ పరిశ్రమలు వస్తున్నాయన్నారు.సీఎం కేసీఆర్‌ ఎన్నికల హామీలను విస్మరించారని అన్నారు బీజేపీ నాయకురాలు విజయశాంతి. నిరుద్యోగ భృతి ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఉద్యోగాల్లేక యువత ఆత్మహత్య చేసుకుంటోందని నిరుద్యోగులకు అండగా బీజేపీ ఉందని చెప్పారు. ఉద్యోగులకు నిరుద్యోగులకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు విజయశాంతి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story