Niranjan Reddy: అన్నం పెట్టే రైతు కన్నీరు పెడితే రాజ్యానికి అరిష్టం

* రైతును ఇబ్బంది పెడితే ఆ పార్టీకి పుట్టగతులు ఉండవు -నిరంజన్‌రెడ్డి

Shilpa
Updated on: 13 Nov 2021 2:06 PM IST
Niranjan Reddy Demanded Central Government to Announce Clear Stance on Paddy Grain Purchases
X

అన్నం పెట్టే రైతు కన్నీరు పెడితే రాజ్యానికి అరిష్టం అంటున్న నిరంజన్ రెడ్డి(ఫైల్ ఫోటో)

Niranjan Reddy: ఆరుగాలం కష్టపడి లోకానికి అన్నం పెట్టే రైతు కన్నీరు పెడితే రాజ్యానికి మంచిది కాదని అన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి. రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తే రాజకీయాల్లో పుట్టగతులు ఉండవన్న విషయాన్ని పాలకులు తెలుసుకోవాలని సూచించారు.

వరి ధాన్యం కొనుగోళ్లపై ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. తల తోక లేకుండా కేంద్రం ఒకటి, రాష్ట్ర బీజేపీ మరొకటి మాట్లాడే దివాళా కోరు రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు నిరంజన్‌రెడ్డి.


Shilpa

Shilpa

Next Story