రేవ్ పార్టీలో నిహారిక... నోటీసులు ఇచ్చిన పోలీసులు

Niharika Konidela Nabbed in a Pub Raid
x

రేవ్ పార్టీలో నిహారిక... నోటీసులు ఇచ్చిన పోలీసులు

Highlights

Pub Raid: బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో కొన్ని రకాల డ్రగ్స్‌ బయటపడ్డాయి.

Pub Raid: బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో కొన్ని రకాల డ్రగ్స్‌ బయటపడ్డాయి. ముందుగానే సమాచారం ఉండటంతో టాస్క్‌పోర్స్‌ పోలీసులు డెకాయ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. వెస్ట్‌, సెంట్రల్‌, నార్త్‌జోన్‌ పోలీసులు దీనిలో పాల్గొన్నారు. పోలీసుల తనిఖీల్లో కొన్ని రకాల డ్రగ్స్‌తో పాటు కొకైన్‌, ఎల్‌ఎస్‌డీ సిగరెట్లు, గంజాయి లభ్యమయ్యాయి. పబ్‌లో అప్పటికే 40 గ్రాముల కొకైన్‌ వాడేయగా.. 12 గ్రాములు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పబ్‌లో పార్టీ జరుగుతున్నప్పటికీ వీడియోలు బయటకు వచ్చాయి. పోలీసులు పబ్‌లోకి వెళ్లిన సమయంలో అక్కడ కాస్త గందరగోళం నెలకొని ఉన్నట్లు వీడియోల్లో ఉంది.

సుమారు 150 మందిని పట్టుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించింది టాస్క్ ఫోర్స్. పట్టుబడిన వారిలో 39 మంది యువతులు ఉన్నారు. వారిలో కొందరు ప్రముఖుల పిల్లలు ఉన్నారు. పట్టుబడిన వారిలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్, నాగబాబు కుమార్తె నిహారిక, మాజీ డీజీపీ కుమార్తె, సహా పలువురు ఉన్నారు. నిహారికకు నోటీసులు ఇచ్చి పంపించారు పోలీసులు. కాగా, ఈ కేసులో నిహారికాను విచారించిన తర్వాత ఆమెకు నోటీసులు ఇచ్చారు. మరోసారి విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories