NIA Raids: విరసం నేత పినాకపాణి నివాసంలో ఎన్‌ఐఏ సోదాలు

NIA Raids: గత నెలలో కొచ్చిలో పినాకపాణిపై కేసు నమోదు...

Shireesha
Published on: 5 March 2022 12:37 PM IST
NIA Raids in Virasam Leader Pinakapani House | Telangana News Today
X

విరసం నేత పినాకపాణి నివాసంలో ఎన్‌ఐఏ సోదాలు

NIA Raids: కర్నూలులో ఎన్ఐఏ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. విరసం నేత పినాకపాణికి మూడో పట్టణ పోలీసుస్టేషన్‌కు రావాలంటూ NIA నోటీసులు జారీ చేసింది. పోలీస్‌స్టేషన్‌లోనే NIA అధికారులు విచారణ చేపట్టనున్నారు. గతంలోనూ పినాకపాణి నివాసంలో NIA బృందాలు తనిఖీలు నిర్వహించాయి. గతంలో జరిపిన సోదాల్లో కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌లు, సెల్‌ఫోన్లలను వారు స్వాధీనం చేసుకున్నారు. అయితే కొచ్చిలో తనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరని విరసం నేత పినాకపాణి తెలిపారు. తాను కొచ్చిలో నేరానికి పాల్పడినట్లు కుట్రపూరితంగా కేసు నమోదు చేశారని అన్నారు.

Shireesha

Shireesha

Next Story