NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు

NIA Raids: 38 ప్రాంతాల్లో సోదాలు, రూ.8.31లక్షల నగదు స్వాధీనం

Rama Rao
Updated on: 18 Sept 2022 3:30 PM IST
NIA Raids in Telugu States | Telugu News
X

NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు

NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో N.I.A సోదాలు నిర్వహించింది. నిజామాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా N.I.A సోదాలు జరిపింది. 38 ప్రాంతాల్లో సోదాలు జరిపి 8లక్షల 31వేల నగదు స్వాధీనం చేసుకుంది. నలుగురిని అదుపులోకి తీసుకుంది. డిజిటల్ పరికరాలతో పాటు కీలక పత్రాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకుంది. జులై 4న P.F.I నేతలపై నిజామాబాద్‌ పోలీసులు F.I.R నమోదు చేశారు. నిజామాబాద్ కేసును ఆధారంగా చేసుకుని N.I.A .... F.I.R నమోదు చేసింది. నిజామాబాద్, హైదరాబాద్, జగిత్యాల, నిర్మల్ ఆదిలాబాద్, కరీంనగర్ , నెల్లూరు, కర్నూలులో N.I.A సోదాలు చేసింది. నిజామాబాద్‌లో 23 చోట్ల N.I.A సోదాలు జరిపింది. ఉగ్ర చర్యల్లో భాగంగా యువకులకు P.F.I. ట్రైనింగ్ ఇస్తోంది. వర్గాల మధ్య చిచ్చు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా క్యాంపులు నిర్వహిస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story