Weather Report: నేడు రేపు తెలంగాణలో తేలికపాటి వర్షాలు.. ఏపీలో మూడు రోజులపాటు వర్ష సూచన

Weather Report: వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

Shekhar G
Updated on: 16 July 2023 8:31 PM IST
Next Three Days Of Rain In Telangana and Andhra Pradesh
X

Weather Report: నేడు రేపు తెలంగాణలో తేలికపాటి వర్షాలు.. ఏపీలో మూడు రోజులపాటు వర్ష సూచన

Weather Report: తెలంగాణలో మరో ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. రేపు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.

మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు చెప్పింది. బుధవారం నుంచి గురువారం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

ఇటు ఏపీలో వచ్చే రెండు, మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. బంగాళాఖాతంలో 17, 18 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. ఈ వర్షాలు నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ఉత్తరాంధ్రలో రెండు మూడు రోజులుగా వానలు పడుతున్నాయి. ఏలూరు జిల్లా ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగుతున్నాయి. కోనసీమ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు, మరికొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Shekhar G

Shekhar G

Next Story