Weather Report: వడగాల్పుల హెచ్చరిక.. 5 రోజుల పాటు పెరగనున్న ఎండలు

Next 5 Days Temperature Rises In Telangana
x

Weather Report: వడగాల్పుల హెచ్చరిక.. 5 రోజుల పాటు పెరగనున్న ఎండలు

Highlights

Weather Report: వేడిని తట్టుకోలేక ఇళ్లకే పరిమితమవుతున్న ప్రజలు

Weather Report: తెలంగాణలో రాష్ట్రంలో ఎండ దంచికొడుతోంది. రాబోయే ఐదు రోజుల పాటు ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని, వడగాడ్పుల ప్రభావం కూడా ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ 15 జిల్లాలకు ఎండలపై ఆరెంజ్​అలర్ట్​జారీ చేసింది. రాత్రిపూట కూడా టెంపరేచర్లు పెరుగుతాయని హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాడ్పుల ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్​భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వడగాడ్పులు ఎక్కువగా వీచే ముప్పు ఉందని వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్​జిల్లాలకు ఆరెంజ్​అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో టెంపరేచర్లు 3 డిగ్రీల వరకు పెరిగే ప్రమాదముందని వాతావరణశాఖ హెచ్చరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories