పెళ్లింట పెను విషాదం..పెళ్లి చేసుకున్న 48గంటల్లోనే గొంతుకోసుకున్న వరుడు..

Khammam: ఖమ్మం జిల్లాలో పెళ్లింట పెను విషాదం చోటుచేసుకుంది. వివాహం జరిగిన 48గంటల్లోపే పెళ్లి కొడుకు చనిపోయాడు.

Arun Chilukuri
Published on: 7 Jun 2022 3:15 PM IST
Newly Married Man Suicide in Khammam
X

పెళ్లింట పెను విషాదం..పెళ్లి చేసుకున్న 48గంటల్లోనే గొంతుకోసుకున్న వరుడు..

Khammam: ఖమ్మం జిల్లాలో పెళ్లింట పెను విషాదం చోటుచేసుకుంది. వివాహం జరిగిన 48గంటల్లోపే పెళ్లి కొడుకు చనిపోయాడు. బంధువులు, కుటుంబ సభ్యులు ఇంకా ఆనందంలో ఉండగానే విషాద వార్త అందర్ని షాక్‌కు గురి చేసింది. నవవరుడు ఆత్మహత్య చేసుకోవడంతో రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. జిల్లాలోని వైరా మండలం పుణ్యవరంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కమ్మంపాటి నరేష్ (29)కు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా ఆర్లపాడు గ్రామానికి చెందిన యువతితో ఈ నెల 4న వివాహమైంది. ఆ తర్వాతి రోజైన ఆదివారం వరుడి స్వగ్రామంలో రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకలో నరేష్ ఆనందంగానే కనిపించాడు. స్నేహితులతో కలిసి డ్యాన్స్ కూడా చేశాడు.

ఈ క్రమంలో విజయవాడ గుణదలలోని మేరిమాత చర్చికి వెళ్లేందుకు గాను సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి బంధువులందర్నీ లేపాడు. స్నానంచేసి వస్తానంటూ గదిలోకి వెళ్లాడు. బంధువులు ప్రయాణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బయల్దేరే సమయం వచ్చినా నరేశ్‌ కన్పించకపోవడం, ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో స్నానాల గది తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. రక్తపు మడుగులో కన్పించడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. బ్లేడుతో చెయ్యి, గొంతు కోసుకుని మరణించినట్టు గుర్తించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story