హైదరాబాడ్ లో నూతన సంవత్సర వేడుకలు నిషేధం

X
Highlights
హైదరాబాద్ లో నూతన సంవత్సర వేడుకలు రద్దు చేసినట్టు సీపీ సజ్జనార్ వెల్లడించారు.
K V D Varma25 Dec 2020 7:54 AM GMT
హైదరాబాద్ లో నూతన సంవత్సర వేడుకలు రద్దు చేసినట్టు సీపీ సజ్జనార్ వెల్లడించారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఎలాంటి వేడుకలు నిర్వహించడానికి వీలు లేదని అయన స్పష్టం చేశారు.
పబ్ నిర్వహకులు తమకు కేటాయించిన సమయం లో మాత్రమే పబ్ లను రన్ చేయాలన్నారు సీపీ. నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకల కు ఎలాంటి ఈవెంట్లు జరకూడానికి వీల్లేదని వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీపీ.
కొత్తసంవత్సరం సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహిస్తామని చెప్పిన సీపీ సజ్జనార్.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. అదేవిధంగా, అపార్ట్ మెంట్ , కమ్యూనిటీ సెంటర్ల లో కూడా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడాన్ని నిషేధించినట్టు సీపీ తెలిపారు. .
Web TitleNew Year celebrations banned in Hyderabad
Next Story