శిరీష మృతిపై వీడని మిస్టరీ.. కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు

శిరీష మృతి చెందిన మరుసటి రోజు.. ఆమె మొబైల్ నుంచి ఫోన్ కాల్‌

Dhatripriya
Published on: 12 Jun 2023 5:59 PM IST
New Twist In Sirisha Murder Case
X

శిరీష మృతిపై వీడని మిస్టరీ.. కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు 

Sirisha Murder Case : శిరీష మృతిపై మిస్టరీ వీడటం లేదు. శిరీషది హత్యా..? ఆత్మహత్యా..? అనేది ఇప్పటివరకు తేలడం లేదు. రెండుసార్లు పోస్టుమార్టం చేసినా వైద్యులు ఏమీ తేల్చకపోవడంతో దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు పోలీసులు. యువతి కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు చేసేందుకు సిద్ధమయ్యారు. అంత్యక్రియల తర్వాత శిరీష తండ్రి జంగయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

శిరీష మృతి చెందిన మరుసటి రోజు.. ఆమె మొబైల్ నుంచి ఫోన్ కాల్‌ వెళ్లింది. అయితే ఇప్పుడు ఆ కాల్ ఎవరు చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంటి నుంచి వెళ్లిన రాత్రే ఫోన్ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో శిరీష బావ అనిల్ తెలిపాడు. తనకు పాస్‌వర్డ్‌ తెలియదని చెప్పాడు. మరి ఆ ఫోన్ కాల్ ఎవరు చేశారనేది కూడా సస్పెన్స్‌గా మారింది. పాస్‌వర్డ్‌ తెలియకపోవడంతో కాల్‌ హిస్టరీ దొరకడం కష్టంగా మారగా.. డేటా డిలీట్ కాకుండా సీపీఆర్ ద్వారా కాల్ హిస్టరీ సేకరించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.

Dhatripriya

Dhatripriya

Next Story