బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మరో కొత్త ట్విస్ట్

X
Highlights
హైదరాబాద్ బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మరో మలుపు తిరిగింది. ఇప్పటివరకు అఖిలప్రియే అసలు సూత్రధారి అంటూ...
Arun Chilukuri6 Jan 2021 12:16 PM GMT
హైదరాబాద్ బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మరో మలుపు తిరిగింది. ఇప్పటివరకు అఖిలప్రియే అసలు సూత్రధారి అంటూ ప్రచారం జరగగా ఇప్పుడు ప్రధాన నిందితుడిగా ఏవీ సుబ్బారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు వివరాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ A1గా ఏవీ సుబ్బారెడ్డి, A2గా అఖిలప్రియ, A3గా భార్గవ్‌రామ్‌ను ప్రకటించారు. ప్రాథమిక దర్యాప్తులో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్ పాత్ర ఉన్నట్లు తేలిందన్నారు. ప్రస్తుతం అఖిలప్రియను అరెస్ట్ చేశామన్న హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అఖిలప్రియను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. కాసేపట్లో సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు.
Web Titlenew twist in Bowenpally kidnap case
Next Story