అప్సర హత్య కేసులో మరో ట్విస్ట్.. కలకలం రేపుతున్న కార్తీక్ రాజా తల్లి ఆడియో

Apsara Murder Case: అప్సర హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

Arun Chilukuri
Published on: 12 Jun 2023 11:20 AM IST
New Twist in Apsara Murder Case
X

అప్సర హత్య కేసులో మరో ట్విస్ట్.. కలకలం రేపుతున్న కార్తీక్ రాజా తల్లి ఆడియో

Apsara Murder Case: అప్సర హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అప్సరకు ఇంతకు ముందే పెళ్లైందని.. భర్త కార్తీక్‌ రాజాతో కలిసి ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి ఆడియోలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొడుకు కార్తీక్ రాజా ఆత్మహత్యకు అప్సర, ఆమె తల్లి వేధింపులే కారణమని కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మీ ఆరోపిస్తున్నారు. కార్తీక్ రాజా.. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని..డబ్బులు కావాలని, టూర్లకు వెళ్దామని అప్సర కార్తీక్ రాజాను వేధించేదనే ఆమె చెబుతోంది.

తన కుమారుడిపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టడంతో తట్టుకోలేకపోయాడన్నారు. కార్తీక్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో మానసికంగా కృంగిపోయాడు. ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడి చావుకు అప్సర, ఆమె తల్లినే కారణం. అప్సర, ఆమె తల్లి హైదరాబాద్‌లో ఉన్నట్లు కూడా తమకు తెలియదు. అప్సరకు సినిమాల్లో నటించాలని కోరిక ఉండేది. అందు కోసమే అప్సరను తీసుకొని హైదరాబాద్ వెళ్లి ఉంటుందని భావిస్తున్నానని కార్తీక్‌ తల్లి అన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story