Huzurabad: హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు 'గుర్తు' టెన్షన్

New Tension To TRS In Huzurabad By-Election Over Party Symbol CAR
x

Huzurabad: హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు 'గుర్తు' టెన్షన్

Highlights

Huzurabad: హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి కొత్త తలనొప్పి వచ్చిపడింది.

Huzurabad: హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి కొత్త తలనొప్పి వచ్చిపడింది. ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు తమ విజయాకాశాలను దెబ్బతీసే అవకాశముందని టీఆర్‌ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. మొన్న దుబ్బాకలో జరిగిన పరిణామాలు హుజురాబాద్‌లో జరగకుండా జాగ్రత్త పడుతున్నాయి గులాబీ శ్రేణులు.

హుజురాబాద్‌లో ఎలాగైనా గెలిచేందుకు అధికార పార్టీ టీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఈటలను ఓడించడంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఉత్సాహంగా సమాయత్తం కావాలని యోచిస్తోంది. అయితే హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఈటల కంటే ఎక్కువగా ఇద్దరు ఇండిపెండెంట్లు వణికిస్తున్నారు. హుజురాబాద్‌లో మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల గుర్తులుండగా మిలిగిన స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. ఇందులో ఒకరికి రోడ్డు రోలర్, మరో అభ్యర్థికి చపాతీ రోలర్ గుర్తులను ఈసీ కేటాయించింది.

హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్‌ పోటీలో ఉన్నారు. ఆయనకు 'చపాతీ రోలర్' గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. బ్యాలెట్‌ పేపర్‌లో చపాతీ రోలర్‌ గుర్తు కారును పోలి ఉండడంతో ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌ ఓడిపోవాల్సి వచ్చిందనే ప్రచారం జరిగింది. గతేడాది జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ చపాతీ రోలర్ గుర్తుపొందిన అభ్యర్థికి 3,570 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో అతను నాలుగో స్థానంలో నిలిచాడు. కానీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ 1118 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను పోటీలో నిలిపింది టీఆర్‌ఎస్. అటు బీజేపీ నుంచి ఈటల గట్టి పోటీ ఇస్తున్నారు. మరోవైపు బల్మూర్ వెంకట్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ కూడా తన శక్తి మేరకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతీ ఓటు కీలకంగా మారింది. ఒక్కోసారి ఒక్క ఓటు కూడా ముఖ్యమే అవుతుంది. అదే గెలుపు ఓటములను నిర్ణయిస్తుంది కూడా. అటువంటిది కారు గుర్తు, చపాతీ రోలర్ గుర్తు చూడటానికి కాస్త ఒకే విధంగా ఉండటంతో హుజురాబాద్ నియోజకవర్గంలో నష్టం జరిగే అవకాశం కూడా ఉందని భావిస్తోంది టీఆర్ఎస్‌ పార్టీ.

ముందస్తు ఎన్నికల్లో దాదాపు 10 నుంచి 15 స్థానాల్లో చపాతీ రోలర్‌ గుర్తు తీవ్ర ప్రభావాన్నే చూపింది. అప్పటి నుంచి ఈ సింబల్‌పై టీఆర్ఎస్ ఈసీతో పోరాటం చేస్తూనే ఉంది. ఇక రోడ్ రోలర్‌తో పాటు సిలిండర్ గుర్తు కూడా మొదటి ఈవీఎంలోనే ఉండడం గమనార్హం. ఈసారి మారిన పార్టీల అభ్యర్థులతో పాటు మారిన గుర్తులను గుర్తుంచుకుని ఓటర్లు ఓటేస్తారా లేక కన్ఫ్యూజన్ లో పడి క్రాస్ ఓటింగ్ బారిన పడతారో వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories