TS Secretariat: నేడు తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభం

New Secretariat Of Telangana Will Be Inaugurated Today
x

TS Secretariat: నేడు తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభం

Highlights

TS Secretariat: మధ్యాహ్నం 1.20 నుంచి 1.32 మధ్య సచివాలయాన్ని ప్రారంభించనున్న సీఎం

TS Secretariat: తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా.. తెలంగాణ ఠీవికి దర్పణంగా..నిర్మితమైన కొత్త సచివాలయం ప్రారంభానికి సిద్ధమైంది. భాగ్యనగరానికి మణిహారంగా నిలవనున్న సచివాలయాన్ని ఇవాళ సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. అత్యాధునిక వసతులతో నిర్మించిన సచివాలయాన్ని మధ్యాహ్నం 1 గంటల 20 నిమిషాల తర్వాత సీఎం ప్రారంభిస్తారు. ఆ తర్వాత కొత్త సచివాలయం నుంచి పరిపాలన కొనసాగనుంది.

సచివాలయం ప్రాంగణంలో సుదర్శనయాగం కొనసాగుతోంది. వేదపండితులు ఉదయం 6 గంటలకు యాగాన్ని ప్రారంభించగా.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి యాగంలో పాల్గొన్నారు. మధ్యా‌హ్నం 1 గంటల తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు సచివాలయానికి సీఎం కేసీఆర్‌ చేరుకోనున్నారు. సుదర్శన యాగ పూర్ణాహుతిలో పాల్గొంటారు. 1.20 నుంచి 1.32 మధ్య సచివాలయ భవనాన్ని ప్రారంభిస్తారు.

సచివాలయ భవనాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్‌ ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌లోకి వెళ్లనున్నారు. అక్కడ పలు దస్త్రాలపై సంతకాలు చేసి పరిపాలనను ప్రారంభిస్తారు. అయితే సీఎం తన ఛాంబర్‌కు వెళ్లే సమయంలో మంత్రులు, అధికారులు ఎవరూ రావొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంత్రులు, అధికారులంతా మధ్యాహ్నం ఒకటి గంటల 58 నిమిషాల నుంచి 2 గంటల 4 నిమిషాల మధ్య తమ తమ ఛాంబర్లలో ఆసీనులై, దస్త్రాలపై సంతకాలు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసిన సమావేశ ప్రాంతంలోకి మంత్రులు, అధికారులు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల తర్వాత సీఎం కేసీఆర్‌ మంత్రులు, అధికారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories