Minister KTR: కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నానికి అంబేద్క‌ర్ పేరు పెట్టాలి..

Minister KTR: కొత్తగ నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు.

Arun Chilukuri
Published on: 13 Sept 2022 12:36 PM IST
New Parliament Building Should Be Named After Ambedkar Says KTR
X

Minister KTR: కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నానికి అంబేద్క‌ర్ పేరు పెట్టాలి..

Minister KTR: కొత్తగ నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అంబేద్క‌ర్ చూపిన బాట‌లోనే తాము న‌డుస్తున్నామ‌ని తెలిపారు. స్వేచ్ఛ‌, సమాన‌త్వం కోరిన వ్య‌క్తి అంబేద్క‌ర్ అన్నారు. అంబేద్క‌ర్ త‌త్వాన్ని టీఆర్ఎస్ ఆచ‌ర‌ణ‌లో చూపింద‌ని మంత్రి తెలిపారు. అంబేద్క‌ర్ ల‌క్ష్యం స‌మాన‌త్వం అన్నారు. తాను రాసిన రాజ్యాంగం దుర్వినియోగం అయితే, దాన్ని తానే ముందుగా త‌గుల‌బెడుతాన‌ని అన్నార‌ని మంత్రి గుర్తు చేశారు. అంబేద్క‌ర్ చూపిన బాట‌లోనే తాము న‌డుస్తున్న‌ట్లు మంత్రి స్ప‌ష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story