బాసర క్షేత్రంలో ఇంద్రపై కొత్త రచ్చ

బాసర క్షేత్రంలో ఇంద్రపై కొత్త రచ్చ
x
Highlights

ఆ మంత్రిపై సొంత పార్టీ నేతలే కారాలు మిరియాలు నూరుతుంటారు. చాన్స్ దొరికితే చాలు ఇరకాటంలోకి నెట్టెయ్యాలని ప్రయత్నిస్తుంటారు. ఇప్పడు వారికి మరో అంశం...

ఆ మంత్రిపై సొంత పార్టీ నేతలే కారాలు మిరియాలు నూరుతుంటారు. చాన్స్ దొరికితే చాలు ఇరకాటంలోకి నెట్టెయ్యాలని ప్రయత్నిస్తుంటారు. ఇప్పడు వారికి మరో అంశం అస్త్రంగా మారుతోందట. యాదాద్రి, వేములవాడలతో పోలికలు పెడుతూ, చికాకు పెట్టేందుకు ట్రై చేస్తున్నారట. ఇంతకీ ఎవరా మంత్రి? ఏదా క్షేత్రం?

యదాద్రి దశ మారింది. వేములవాడ వెలుగులు విరజిమ్ముతోంది. మరి టెంపుల్‌ సిటీ బాసరలో ఆ వెలుగులేవి, జిలుగులేవి, చేసిన బాసలేంటి? జరుగుతున్నదేంటి? ఇదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయాలను మండిస్తోంది. అటు తిరిగి ఇటు తిరిగి దేవాదాయ శాఖా మంత్రిని ఉక్కిరిబిక్కిరి చేస్తోందట.

దేశ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన ఆలయాల్లో చదువులతల్లి సరస్వతి ఆలయం ఒకటి. ఇది నిర్మల్ జిల్లా బాసరలో ఉంది. పవిత్ర గోదావరి తీరాన కొలువైన ఆలయం. అమ్మవారిని దర్శించుకోవడానికి దేశ వ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు. ప్రధానంగా పిల్లలకు అక్షరాభాస్యాలు, మహిళలు కుంకుమ పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ అక్షర శ్రీకారం చేయిస్తే ఉన్నత విద్యావంతులు అవుతారని భక్తుల నమ్మకం. అందుకే దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తుల తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత, బాసర టెంపుల్‌ సిటీ మరింత అభివృద్ది జరుగుతుందని భక్తులు ఆశించారు. ప్రధానంగా దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఇదే జిల్లాకు చెందిన నేత కావడంతో, యాదాద్రిని మించిన అభివృద్ది జరుగుతుందని అనుకున్నారు. పైగా అప్పట్లో బాసర అభివృద్దికి ఆగమ పండితుల చేత మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఈ మాస్టర ప్లాన్‌లో భాగంగా గర్భ గుడిని విస్తరించడం, మహాప్రాకారం నిర్మించడం, పుష్కరిణి ఏర్పాటు ఇలా మాస్టర్‌ ప్లాన్‌ను పకడ్బందీగా డిజైన్ చేశారు. కానీ ఆచరణ విషయానికి వచ్చే సరికి, ప్లాన్‌ అటకెక్కిందన్న చర్చ జరుగుతోంది. అదే మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పట్ల, ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతోందట.

మాస్టర్ ప్లాన్ రూపొందించి ఏళ్లు గడుస్తున్నా అభివృద్ది పనులు మొదలు లేదు. యాభై కోట్లతో డెవలప్ చేస్తామని ఊదరగొట్టినా, ఇప్పటి వరకు పైసా విడుదల కాలేదట. ఒకవైపు యాదాద్రి, వేములవాడ ఆలయాలు శరవేగంగా అభివృద్ది చెందుతుంటే, బాసరలో మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిందట. మాస్టర్ ప్లాన్ నిధుల గురించి పట్టించుకోని మంత్రి, ఆలయ పరిసర ప్రాంతాల్లో గెస్ట్ హౌజ్‌ల కోసం హుండీ డబ్బులు కేటాయిస్తున్నారని, ప్రత్యర్థి పార్టీ నేతల నుంచే కాదు, సొంత పార్టీ లీడర్ల నుంచీ ఆరోపణలు వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. మంత్రి నిర్లక్ష్యమే కారణమంటు విమర్శలు సైతం చేస్తున్నారట. బాసర మాస్టర్‌ ప్లాన్ అమలుకు నోచుకోకపోతే, మంత్రి ఇంద్రకరణ్‌కు అప్రదిష్ట తప్పదని సొంత పార్టీ నాయకులే స్వరం పెంచుతున్నారట. ఆ నోటా ఈ నోటా ఈ విమర్శలు వింటున్న మంత్రి ఇంద్రకరణ్, కావాలనే తనపై దుష్ర్పచారం చేస్తున్నారని రగిలిపోతున్నారట.


Show Full Article
Print Article
Next Story
More Stories