తెలుగు రాష్ట్రాలను టెన్షన్ పెడుతోన్న కరోనా కొత్త స్ట్రెయిన్

తెలుగు రాష్ట్రాలను టెన్షన్ పెడుతోన్న కరోనా కొత్త స్ట్రెయిన్
x
Highlights

కరోనా కొత్త స్ట్రెయిన్ టెన్షన్ పెడుతోంది. యూకే నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతోంది. దీంతో మరింత...

కరోనా కొత్త స్ట్రెయిన్ టెన్షన్ పెడుతోంది. యూకే నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతోంది. దీంతో మరింత ఆందోళన మొదలైంది జనాల్లో ! ఇక అటు శ్రీకాకుళం జిల్లాలో కొత్త స్ట్రెయిన్ ప్రచారం స్థానికులను టెన్షన్ పెట్టింది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.

కరోనా కొత్త స్ట్రెయిన్ పెడుతున్న పెయిన్ అంతా ఇంతా కాదు ! యూకే అక్కడి నుంచి ఎవరు ఇక్కడ అడుగు పెట్టిన ప్రతీఒక్కరిని గాలిస్తున్న అధికారులు వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. తొలి రకం కరోనాతో పోలిస్తే ఈ కొత్త స్ట్రెయిన్ 70శాతం అధికంగా వ్యాప్తి ఉండడంతో మరిన్ని భయాందోళనలు కనిపిస్తు్నాయ్. ఈ రకం వేరియంట్ వెలుగు చూడడానికి పదిరోజుల ముందు పది రోజుల తర్వాత ఇండియాకు ఎవరెవరు వచ్చారు వాళ్లంతా ఎవరెవరిని కలిశారన్న లెక్క తీస్తోంది. అప్పట్లో అనుసరించిన మర్కజ్ ఫార్ములాను ఇప్పుడు ఫాలో అవుతున్నారు.

బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మేడ్చల్‌ జిల్లాకు చెందిన మరో ఇద్దరికి కొత్తగా కరోనా పాటిజివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు మొత్తం బాధితుల సంఖ్య 18కి చేరింది. హైదరాబాద్‌ జిల్లాలో నలుగురు, మేడ్చల్‌ జిల్లా నుంచి ఆరుగురు, జగిత్యాల నుంచి ఇద్దరు, మంచిర్యాల, రంగారెడ్డి, నల్గొండ, సిద్దిపేట, సంగారెడ్డి, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల నుంచి ఒక్కొక్కొరు చొప్పున కరోనా పాజిటివ్‌ బాధితులున్నారు.

ఏపీలోనూ ఇలాంటి ప్రక్రియే కొనసాగుతోంది. నెలరోజుల్లో యూకే నుంచి ఇక్కడి వచ్చిన అందరి వివరాలు సేకరించిన అధికారులు వారిని పట్టుకొని పరీక్షలు చేయిస్తున్నారు. అసలే కొత్త వైరస్ భయం గుండెల్లో గుబులు పెట్టిస్తున్న వేళ సోషళ్ మీడియాలో జరిగిన ఓ ప్రచారం మరింత టెన్షన్ పెట్టించింది. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం బీసీ కాలనీలో కరోనా కొత్త స్ట్రెయిన్ అంటూ ప్రచారం జరగడంతో జిల్లావాసులు ఉలిక్కిపడ్డారు. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లు బ్రిటన్ నుంచి రావడంతో వారిని ఆసుపత్రికి తరలించి అధికారులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరఘట్టం ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.

ఓవైపు వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు కొత్త రకం స్ట్రెయిన్ ప్రతీ ఒక్కరిని టెన్షన్ పెట్టిస్తోంది. అసలే వ్యాప్తి ఎక్కువ కరోనా లేదన్నట్లుగా కనపిస్తున్న జనం ఇలాంటి తరుణంలో వైరస్ ఎంటర్ అయితే ఏమైనా ఉందా అంటూ పలువురిలో భయాలు కనిపిస్తున్నాయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories