Coroana Update: తెలంగాణలో కరోనాతో ఒకరు మృతి

X
Highlights
తెలంగాణలో కొత్తగా 224 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం......
Samba Siva Rao11 Jan 2021 4:20 AM GMT
తెలంగాణలో కొత్తగా 224 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం... గడిచిన 24 గంటల్లో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1,566 కి పెరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలోనే కొత్తగా 56 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 461 మంది డిశార్చ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,90,008 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,83,924 మంది కోలుకున్నారు.తెలంగాణలో ప్రస్తుతం 4,518 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,439 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.
Web TitleNew Corona Virus Positive Cases In Telangana
Next Story