టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆటఆడుకుంటున్న నెటిజన్లు

Guvvala Balaraju: ఎమ్మెల్యే పదవికి గువ్వల బాలరాజు రాజీనామా చేయాలంటూ డిమాండ్‌

Sandeep Eggoju
Published on: 12 Nov 2021 9:29 PM IST
Netizens Demand to Resign Guvvala Balaraju MLA Post
X

గువ్వల బాలరాజు (ఫైల్ ఇమేజ్)

Guvvala Balaraju: టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రస్తుతం ఈ పేరు సోషల్‌ మీడియాలో మారు మ్రోగుతోంది. హుజూరాబాద్‌లో బీజేపీ గెలిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న గువ్వల బాలరాజు రాజీనామా చేయకపోవడంతో ఆ‍యనను సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఓ ఆటఆడుకుంటున్నారు. ఎన్నికలకు ముందు గాంభీర్యాన్ని ప్రదర్శించిన గువ్వల టీఆర్‌ఎస్‌ ఓటమితో ఇరుకున పడ్డారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా అధిష్టానం పిలుపుతో రైతుల ధర్నాలో పాల్గొంటే ఆయన మాత్రం సోషల్‌ మీడియా ధాటికి సొంత నియోజకవర్గంలోనే పాల్గొనలేకపోయారు

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story