Nereducherla Municipal Results 2026: నేరేడుచర్లలో జనసేన బోణీ: ‘హస్తం’ హవాలోనూ ఖాతా తెరిచిన ‘గాజు గ్లాసు’..!

Nereducherla Municipal Results 2026: సూర్యాపేట జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 13 Feb 2026 12:24 PM IST
Nereducherla Municipal Results 2026: నేరేడుచర్లలో జనసేన బోణీ: ‘హస్తం’ హవాలోనూ ఖాతా తెరిచిన ‘గాజు గ్లాసు’..!
X

Nereducherla Municipal Results 2026: సూర్యాపేట జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ (JanaSena) తన ఉనికిని చాటుకుంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ వంటి ప్రధాన పార్టీల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో జనసేన అభ్యర్థి విజయం సాధించి, మున్సిపాలిటీలో ‘గాజు గ్లాసు’ గుర్తును మెరిపించారు.

ఫలితాల స్పష్టమైన చిత్రం:

నేరేడుచర్లలోని మొత్తం 15 వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి:

కాంగ్రెస్: 09 వార్డులు (స్పష్టమైన మెజారిటీ)

బీఆర్‌ఎస్‌: 05 వార్డులు

జనసేన: 01 వార్డు

నేరేడుచర్లలో మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నప్పటికీ, జనసేన ఒక వార్డును గెలుచుకోవడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సూర్యాపేట జిల్లాలో జనసేన తన ఖాతాను తెరవడం ద్వారా భవిష్యత్తులో ఇతర నియోజకవర్గాల్లోనూ పుంజుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విజయంతో నేరేడుచర్లలో జనసేన శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. తమ గెలుపు మార్పుకు నాంది అని జనసేన నేతలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story