Nereducherla Municipal Election Results 2026: నేరేడుచర్లలో ‘హస్తం’ ఘనవిజయం: మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం.. వెనుకంజలో బీఆర్‌ఎస్‌!

Nereducherla Municipal Election Results 2026: సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి విజేతగా నిలిచింది.

Arun Chilukuri
Published on: 13 Feb 2026 11:29 AM IST
Nereducherla Municipal Election Results 2026: నేరేడుచర్లలో ‘హస్తం’ ఘనవిజయం: మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం.. వెనుకంజలో బీఆర్‌ఎస్‌!
X

Nereducherla Municipal Election Results 2026: సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి విజేతగా నిలిచింది. ఉత్కంఠగా సాగిన కౌంటింగ్‌లో మెజారిటీ వార్డులను గెలుచుకుని మున్సిపల్ పీఠంపై తమ జెండాను ఎగురవేసింది.

ఫలితాల సరళి ఇలా ఉంది:

మున్సిపాలిటీలోని మొత్తం 15 వార్డులకు జరిగిన ఎన్నికల్లో పార్టీల బలాబలాలు:

కాంగ్రెస్: 09 వార్డులు

బీఆర్‌ఎస్‌: 05 వార్డులు

ఇతరులు (ఇండిపెండెంట్): 01 వార్డు

నేరేడుచర్లలో మ్యాజిక్ ఫిగర్‌ను సునాయాసంగా దాటేసిన కాంగ్రెస్ పార్టీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో తన పట్టును నిరూపించుకుంది. బీఆర్‌ఎస్‌ పార్టీ 5 స్థానాలకే పరిమితం కాగా, స్వతంత్ర అభ్యర్థి ఒక చోట విజయం సాధించారు. కాంగ్రెస్ ఘనవిజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు నేరేడుచర్ల పురవీధుల్లో భారీ విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story