Kaloji Literary Award 2025: కవయిత్రి నెల్లుట్ల రమాదేవిని వరించిన కాళోజీ సాహితీ పురస్కారం

Kaloji Literary Award 2025: కవయిత్రి నెల్లుట్ల రమాదేవిని ఈ ఏడాది కాళోజీ సాహితీ పురస్కారం వరించింది.

Arun Chilukuri
Published on: 8 Sept 2025 12:02 PM IST
Kaloji Literary Award 2025: కవయిత్రి నెల్లుట్ల రమాదేవిని వరించిన కాళోజీ సాహితీ పురస్కారం
X

Kaloji Literary Award 2025: కవయిత్రి నెల్లుట్ల రమాదేవిని ఈ ఏడాది కాళోజీ సాహితీ పురస్కారం వరించింది. రాష్ట్రప్రభుత్వం తరఫున తెలంగాణ రచయిత అందెశ్రీ అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ రమాదేవి పేరును ఎంపిక చేసింది. కాళోజీ జయంతిని పురస్కరించుకొని ఈనెల 9న తెలంగాణ భాషా దినోత్సవంలో భాగంగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఈమె ఆంధ్రా బ్యాంకులో పనిచేసి సీనియర్‌ మేనేజర్‌గా ఉద్యోగవిరమణ పొందారు.

చిన్నతనం నుంచే సాహిత్యంపై మక్కువతో అనేక రచనలు చేశారు. మనసు భాష, రమణీయం, మనసు మనసుకూ మధ్య, రమాయణం లాంటి అనేక కవితలు, కథలు, నానీలు రాశారు. రమ కలం పేరుతో కార్టూన్లు కూడా వేస్తారు. 2004లో సుశీలా నారాయణరెడ్డి పురస్కారం, 2015లో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారంతో పాటు పలు అవార్డులు రమాదేవి పొందారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావులు రమాదేవికి శుభాకాంక్షలు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story