Telangana: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యం

Telangana: నమూనా తీసుకోకుండా కరోనా రిపోర్ట్ * కేవలం పేరు నమోదు చేసినందున మొబైల్‌ ఫోన్‌కు రిపోర్ట్‌

Sandeep Eggoju
Published on: 20 April 2021 12:11 PM IST
Neglect of Doctors in Adilabad District Center
X

Representational Image

Telangana: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. నమూనా తీసుకోకుండానే కరోనా నెగటీవ్ అని రిపోర్ట్ పంపిన వైన్యం ఇప్పుడు చర్చనీయాంశమైంది. స్థానిక శాంతినగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఐదుగురు వ్యక్తులు కరోనా టెస్ట్ చేయించుకోడానికి పేరు నమోదు చేసుకున్నారు. ఐతే అక్కడి వైద్యసిబ్బంది టెస్ట్‌ల సంఖ్య మించిపోయినందున మర్నాడు రావల్సిందిగా కోరారు. దాంతో తిరిగి వచ్చేసిన ఐదుగురికి మర్నాడు మొబైల్ ఫోన్లకు కరోనా నెగటీవ్‌గా రిపోర్ట్ పంపారు. కనీసం నమూనా కూడా తీసుకోకుండా రిపోర్ట్ పంపిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చూసి నివ్వెరపోయారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story