Neelam Madhu: సీఎం రేవంత్, జిల్లా ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిసిన.. నీలం మధు

Neelam Madhu: సభ విజయవంతానికి కలిసి పనిచేసిన నీలం మధును అభినందించిన సీఎం

Shashank Gullapelli
Published on: 7 April 2024 3:23 PM IST
Neelam Madhu Meets Revanth Reddy And Konda Surekha
X

Neelam Madhu: సీఎం రేవంత్, జిల్లా ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిసిన.. నీలం మధు

Neelam Madhu: తుక్కుగూడ జనజాతర సభ విజయవంతం అయ్యిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేతలంతా కలిసికట్టుగా ముందుకు కదిలారన్నారు. మెదక్ పార్లమెంట్ తరపున భారీగా జన సమీకరణ చేసి సభను సక్సెస్ చేశారని సీఎం కితాబు ఇచ్చారు. సభ సూపర్ సక్సెస్ అయిన సందర్భంగా.. ఆదివారం మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్,, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, జిల్లా ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. సభ విజయవంతానికి కలిసి పనిచేసిన నీలం మధును ముఖ్యమంత్రి రేవంత్ అభినందించారు. ఇదే స్పూర్తితో రాబోయే ఎన్నికల్లోనూ ప్రజలలోకి వెళ్లాలని సూచించారు. అందరిని కలుపుకుని ఐక్యంగా ముందుకెళ్లి మెదక్‌ పార్లమెంట్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story