నవీన్ హత్య కేసులో కొత్త నిజాలు వెలుగులోకి.. హరిహరకృష్ణ అసలు ఏమేం చేశాడంటే..

Naveen Murder Case: ప్రేమకు అడ్డుగా ఉన్నాడనే నవీన్ హత్య

Dhatripriya
Published on: 27 Feb 2023 6:34 PM IST
Naveen Murder Case Shocking Facts
X

నవీన్ హత్య కేసులో కొత్త నిజాలు వెలుగులోకి.. హరిహరకృష్ణ అసలు ఏమేం చేశాడంటే..

Naveen Murder Case: అబ్దుల్లాపూర్‌మెట్‌లో నవీన్‌ హత్య కేసు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమకు అడ్డుగా ఉన్నాడనే నవీన్ హత్య జరిగినట్టు పోలీసులు తెలిపారు. మూడునెలల ముందే నవీన్‌ హత్యకు హరి స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. రెండు నెలల క్రితం మలక్‌పేట్‌ సూపర్‌ మార్కెట్‌లో కత్తి కొనుగోలు చేసి.. ఈ నెల 17న పక్కా ప్లాన్ ప్రకారం నవీన్‌ను హత్య చేశాడు. హత్యకు ముందు పెద్ద అంబర్‌పేట్‌ వైన్స్‌లో హరి, నవీన్‌ ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అయితే.. మద్యం మత్తులో యువతి విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం.. ఓఆర్ఆర్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో నవీన్‌ను గొంతు నులిమి హత్య చేశాడు హరి. ఆ తర్వాత కత్తితో శరీరాన్ని విడి భాగాలుగా చేశాడు. తల, వేళ్లు, దుస్తులు, శరీర విడిభాగాలను బ్యాగులో వేసుకొని బ్రాహ్మణపల్లి నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. పక్కనే ఉన్న ఫ్రెండ్‌ హసన్‌ ఇంటికి వెళ్లిన హరి.. నవీన్ హత్య విషయం ‎ఫ్రెండ్‌కు చెప్పాడు. మరుసటి రోజు ప్రియురాలికి హత్య విషయాన్ని తెలిపాడు. హత్య అనంతరం వరంగల్‌, కోదాడ, ఖమ్మం, విశాఖపట్నంకు హరి పారిపోయాడు. ఈ నెల 24న తిరిగి హైదరాబాద్‌లోని హత్య చేసిన స్పాట్‌కు వెళ్లిన హరి.. శరీర విడిభాగాలను సేకరించి దహనం చేశాడు. అదే రోజు సాయంత్రం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

మరోవైపు నిందితుడు హరిని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. హయత్‌నగర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన పోలీసులు.. 8 రోజుల పాటు కస్టడీకి కోరుతూ పిటిషన్‌ వేశారు. నిందితుడు హరిపై హత్య, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదుతో.. రంగారెడ్డి జిల్లా సెషన్స్‌ కోర్టుకు పిటిషన్‌ బదిలీ అయింది. చర్లపల్లి జైల్లో నిందితుడు హరికి నోటీస్‌ అందజేశారు పోలీసులు. రేపు రంగారెడ్డి జిల్లా కోర్టులో వాదనలు జరగనున్నాయి.

Dhatripriya

Dhatripriya

Next Story