Naveen Murder Case: చంచల్‌గూడ జైలుకు సైకో ప్రియురాలు నిహారిక

Naveen Murder Case: సంచలన సృష్టించిన నవీన్ హత్యకేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.

Arun Chilukuri
Updated on: 7 March 2023 2:28 PM IST
Naveen Murder Case: Girlfriend Niharika Arrested
X

Naveen Murder Case: చంచల్‌గూడ జైలుకు సైకో ప్రియురాలు నిహారిక

Naveen Murder Case: సంచలన సృష్టించిన నవీన్ హత్యకేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. నవీన్ హత్యకేసులో ప్రియురాలు నిహారికతో పాటు హరిహర కృష్ణ స్నేహితుడు హసన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు హరికి సహకరించడమే కాకుండా.. హత్య విషయం తెలిసి, దాచిపెట్టినందుకు వీరిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. నవీన్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమన్న ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ.. హత్య తర్వాత నిహారికకు హరిహర ఫొటోలు పంపాడన్నారు.

హత్య తర్వాత ఘటనాస్థలికి నిహారిక, హసన్ వెళ్లారని చెప్పారు. ఇక.. హత్య తర్వాత హరిహరకు నిహారిక 15 వందల రూపాయలు ఇచ్చిందని తెలిపారు. వనస్థలిపురం ఆస్పత్రిలో నిహారిక, హసన్ కు వైద్యపరీక్షలు పూర్తి చేసిన అనంతరం నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. హసన్, నిహారికలకు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. అనంతరం హసన్ ను చర్లపల్లి జైలుకు, నిహారికను చంచల్ గూడ జైలుకు తరలించారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story