ఆసిఫాబాద్ గిరిజన మహిళపై అత్యాచారం ఘటనపై స్పందించిన జాతీయ ఎస్టీ కమిషన్

పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Sept 2024 5:39 PM IST
National ST Commission reacts to rape incident of Asifabad tribal woman
X

ఆసిఫాబాద్ గిరిజన మహిళపై అత్యాచారం ఘటనపై స్పందించిన జాతీయ ఎస్టీ కమిషన్ 

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన మహిళపై జరిగిన అత్యాచారం ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ స్పందించింది. విషయం తెలుసుకొని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ పరామర్శించారు. వారితో పాటు బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ కూడా వెళ్లారు. బాధిత మహిళను పరామర్శించిన అనంతరం మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి సూపరిండెంట్‌కు ఆదేశించారు. అదేవిధంగా అత్యాచారం ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్‌ రాష్ట్ర డీజీపీని కోరారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story