ఖమ్మం పోస్టల్‌ బ్యాంక్‌కి జాతీయ స్థాయి గుర్తింపు

ఖమ్మం పోస్టల్‌ బ్యాంక్‌కి జాతీయ స్థాయి గుర్తింపు
x
Highlights

ఖమ్మం పోస్టల్‌ డివిజన్‌ జాతీయస్థాయిలో ఓ అరుదైన రికార్డును కైవసం చేసుకుంది. ఖమ్మం పోస్టల్‌ డివిజన్ ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ)...

ఖమ్మం పోస్టల్‌ డివిజన్‌ జాతీయస్థాయిలో ఓ అరుదైన రికార్డును కైవసం చేసుకుంది. ఖమ్మం పోస్టల్‌ డివిజన్ ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) ఆధార్‌ ఆధారిత విధానంలో జాతీయస్థాయిలో నంబర్‌వన్‌గా నిలిచినట్లు ఢిల్లీ జాతీయ పోస్టల్‌ విభాగం ప్రకటించింది. 2018 సెప్టెంబర్‌ నుంచి జాతీయ స్థాయిలో పోస్టల్‌ శాఖ ఐపీపీబీ బ్రాంచ్‌లతో నిర్వహిస్తోంది. 2019 సెప్టెంబర్‌ నుంచి ఆధార్‌ ఆధారిత విధానాన్ని (ఏఈపీఎస్‌) అమలులోకి తీసుకువచ్చింది. ఈ రెంటికీ సంబంధించిన విధుల నిర్వహణలో మంచి ఫలితాలను సాధిస్తుంది. దీంతో ఢిల్లీ జాతీయ పోస్టల్‌ విభాగం ఖమ్మం డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ యలమందయ్యకు ఆన్‌లైన్‌లో ఉత్తర్వులు అందాయి.

ఖమ్మం పోస్టల్‌ డివిజన్ పరిధిలోని 611 పోస్టల్‌ బ్రాంచ్‌ల్లో ఐపీపీబీని నిర్వహిస్తోంది. ఏ బ్యాంక్‌లో ఖాతా ఉన్నప్పటికీ ఆధార్‌ కార్డు ఆధారంగా ఐపీపీబీ ద్వారా నగదును డ్రా చేసుకునే విధానాన్ని అమలు చేస్తున్నారు. 31వ తేదీ నాటికి ఈ విధానంలో ఐపీపీబీ దేశం మొత్తంలో ఆగస్టు రూ.6 వేల కోట్ల నగదును పంపిణీ చేసింది. ఈ లావాదేవీల నిర్వహణలో ఖమ్మం డివిజన్‌ ఐపీపీబీ దేశంలో నంబర్‌వన్‌గా నిలిచింది.

దేశవ్యాప్తంగా మూడు సర్కిళ్లను టాప్‌ ర్యాంకర్లుగా గుర్తించింది. ఐపీపీబీ రెండేళ్లు నిండిన క్రమంలో ఢిల్లీ పోస్టల్‌ కార్పొరేట్‌.. ఆధార్‌ ఆధారిత విధానం అమలులో ఖమ్మం డివిజన్‌ ఐపీపీబీ నంబర్‌వన్‌గా నిలిచిందని ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ ర్యాంకుల్లో ఖమ్మం గాంధీచౌక్‌ బ్రాంచ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ సాధించిన బ్రాంచ్‌గా నిలిచింది. హూజూర్‌నగర్‌ బ్రాంచ్‌కి 2వ ర్యాంక్‌ దక్కింది. మూడో ర్యాంక్‌ నారాయణరావుపేట బ్రాంచ్,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కడప బ్రాంచ్‌ 5వ ర్యాంక్‌ దక్కించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories