Navdeep: నవదీప్‌ను ప్రశ్నిస్తున్న నార్కోటిక్స్‌ పోలీసులు

Navdeep: ఈ కేసులో A-29గా నవదీప్‌ పేరు

Shekhar G
Published on: 23 Sept 2023 12:14 PM IST
Narcotics Police Questioning Navdeep
X

Navdeep: నవదీప్‌ను ప్రశ్నిస్తున్న నార్కోటిక్స్‌ పోలీసులు

Navdeep: మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో నార్కోటిక్స్‌ పోలీసుల ఎదుట హాజరయ్యారు హీరో నవదీప్. నార్కోటిక్స్‌ టీమ్‌ హెడ్‌ సునీతరెడ్డి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. డ్రగ్స్‌ కేసులో కీలక ఆధారాలను NCB అధికారులు సేకరిస్తున్నారు. నవదీప్‌ ద్వారానే సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్‌ సరఫరా అయినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రామచందర్‌తో కలిసి నవదీప్‌ డ్రగ్స్‌ తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రామచందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు నవదీప్‌కు నార్కోటిక్స్‌ పోలీసులు నోటీసులిచ్చినట్టు సమాచారం. రామచందర్‌తో నవదీప్‌కు ఉన్న సంబంధంపై ఆరా తీస్తున్నారు.

హైదరాబాద్‌ డ్రగ్స్‌ కేసు దర్యాప్తును స్పీడప్‌ చేసింది నార్కోటిక్స్‌ టీమ్. మాదాపూర్‌ ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లో డ్రగ్స్‌ పార్టీ కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకుంటోంది నార్కోటిక్స్ టీమ్‌. హీరో నవదీప్‌కు 42 CrPC నోటీసులు ఇచ్చిన పోలీసులు.. ఇవాళ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో తెలిపారు. హీరో నవదీప్‌కు డ్రగ్స్‌ రాకెట్‌తో సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో.. కాసేపటి క్రితమే నార్కోటిక్స్‌ పోలీసుల ఎదుట హీరో నవదీప్‌ విచారణకు హాజరయ్యారు. నవదీప్‌ మొబైల్‌ కాంటాక్స్ట్‌లో డ్రగ్స్‌ యూజర్లు ఎవరైనా ఉన్నారా..?

అని కూపీ లాగుతున్నారు. భారీగా డ్రగ్స్‌ కొన్నవారిలో హీరో నవదీప్‌ ఉన్నట్టు రామచందర్‌ విచారణలో పోలీసులు గుర్తించారు. దీంతో నవదీప్‌ విచారణలో పలువురు సినీ ఇండస్ట్రీకి చెందినవారి పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు డ్రగ్స్‌ కేసులో 8 మందిని అరెస్ట్‌ చేయగా.. మరో 35 మంది నిందితులను గుర్తించారు. ఈ కేసులో A-29గా నవదీప్‌ పేరును చేర్చింది నార్కోటిక్స్‌ టీమ్. ఇక.. ఈ కేసుపై నవదీప్‌.. న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నట్టు సమాచారం.

Shekhar G

Shekhar G

Next Story