Narayankhed Municipal Election Results 2026: నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ హవా: మున్సిపల్ పీఠం కైవసం.. 11 వార్డుల్లో ‘హస్తం’ ఘనవిజయం!

Narayankhed Municipal Election Results 2026: సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన పట్టును చాటుకుంది.

Arun Chilukuri
Published on: 13 Feb 2026 11:59 AM IST
Narayankhed Municipal Election Results 2026: నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ హవా: మున్సిపల్ పీఠం కైవసం.. 11 వార్డుల్లో ‘హస్తం’ ఘనవిజయం!
X

Narayankhed Municipal Election Results 2026: సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన పట్టును చాటుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రభంజనం సృష్టించి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ మరియు బీజేపీలు నామమాత్రపు స్థానాలకే పరిమితమయ్యాయి.

పార్టీల వారీగా ఫలితాలు:

నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 15 వార్డులకు జరిగిన ఎన్నికల్లో తుది ఫలితాల సరళి ఇలా ఉంది:

కాంగ్రెస్: 11 వార్డులు

బీఆర్‌ఎస్‌: 03 వార్డులు

బీజేపీ (BJP): 01 వార్డు

మొత్తం 15 స్థానాల్లో 11 చోట్ల కాంగ్రెస్ జయకేతనం ఎగురవేయడంతో మున్సిపల్ చైర్మన్ పీఠం హస్తం పరం కావడం ఖాయమైంది. బీఆర్‌ఎస్‌ కేవలం మూడు స్థానాలను మాత్రమే గెలుచుకోగా, బీజేపీ ఒక్క వార్డులో విజయం సాధించింది. భారీ మెజారిటీతో విజయం సాధించడంతో నారాయణఖేడ్ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story