వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన నందిని విక్రమార్క

Nandini Vikramarka: వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు

Jyothi
Updated on: 8 July 2022 3:53 PM IST
Nandini Vikramarka Paid Tribute to YSR
X

వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన నందిని విక్రమార్క

Nandini Vikramarka: స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి, డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 73వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సతీమణి నందిని విక్రమార్క. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తక్కేళ్లపాడులో వైఎస్‌ఆర్ జయంతి వేడుకల్లో నందిని విక్రమార్క పాల్గొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేసుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రుపాలెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి, సుధాకర్ రెడ్డి, ఎర్రుపాలెం, మధిర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Jyothi

Jyothi

Next Story