మంత్రి హ‌రీశ్‌రావును క‌లిసిన బాల‌కృష్ణ‌.. తమకు మద్దతు ఇవ్వాలని..

Nandamuri Balakrishna: తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో బసవతారకం ఆస్పత్రి ఛైర్మన్ బాలకృష్ణ భేటీ అయ్యారు.

Arun Chilukuri
Published on: 10 Jan 2022 7:07 PM IST
Nandamuri Balakrishna meet Minister Harish Rao
X

మంత్రి హ‌రీశ్‌రావును క‌లిసిన బాల‌కృష్ణ‌.. తమకు మద్దతు ఇవ్వాలని..

Nandamuri Balakrishna: తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో బసవతారకం ఆస్పత్రి ఛైర్మన్ బాలకృష్ణ భేటీ అయ్యారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రతినిధులు మంత్రితో సమావేశమయ్యారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూల్‌ అందిస్తున్న సేవలను, సంస్థ కార్యకలాపాలను బాలకృష్ణ మంత్రి హరీష్‌రావుకు వివరించారు. ఆస్పత్రి అభివృద్ధి అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం తమకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు మంత్రి హరీష్‌రావు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story