Nampally Court: ఫామ్‌హౌజ్ కేసులో నిందితులకు బెయిల్ నిరాకరణ
Nampally Court: ఫామ్‌హౌజ్ కేసులో నిందితులకు నాంపల్లి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది.
Nampally Court: ఫామ్‌హౌజ్ కేసులో నిందితులకు బెయిల్ నిరాకరణ
Nampally Court: ఫామ్‌హౌజ్ కేసులో నిందితులకు నాంపల్లి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. నిందితుల తరపున దాఖలైన బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఓ వైపు సిట్ విచారణ జరుగుతున్న క్రమంలో నిందితులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరించింది. మరోవైపు ఈ కేసులో ఏ2 గా ఉన్న నందకుమార్ పై పీటీ వారెంట్ కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నందకుమార్‌పై పీటీ వారెంట్‌కు నాంపల్లి కోర్టు అనుమతిస్తే నందకుమార్‌ను మరోసారి అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చనున్నారు.
Next Story




