Hyderabad: నాంపల్లి కోర్టులో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు ఊరట

Hyderabad: అక్బరుద్దీన్‌ను నిర్దోషిగా ప్రకటించిన నాంపల్లి కోర్టు

Rama Rao
Published on: 13 April 2022 3:25 PM IST
Nampally Court Acquits Akbaruddin Owaisi | Telugu News
X

Hyderabad: నాంపల్లి కోర్టులో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు ఊరట

Hyderabad: నాంపల్లి కోర్టులో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు భారీ ఊరట లభించింది. 2012లో అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యల కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. అక్బరుద్దీన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. మరోవైపు సంబరాలకు అనుమతి లేదని నాంపల్లి కోర్టు ఆదేశించింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీపై నమోదైన కేసుల్లో నాంపల్లి కోర్టు తుది తీర్పు వెల్లడించింది.

9 సంవత్సరాల క్రితం నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో అక్బరుద్దీన్ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ ముగిసింది. ఇందులో భాగంగా 30 మందికిపైగా సాక్షులను కోర్టు విచారించింది. విచారణ ముగిసిన నేపథ్యంలో అక్బరుద్దీన్‌పై నమోదైన రెండు కేసులను కోర్టు కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.

Rama Rao

Rama Rao

Next Story