నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో దోషికి 21 ఏళ్లు జైలు శిక్ష

నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో దోషికి 21 ఏళ్లు జైలు శిక్ష
x
Highlights

Nalgonda: ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

Nalgonda: ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడు దోమల రాముకు 21 ఏళ్ల జైలు శిక్ష, రూ. 30 వేల జరిమానా విధించింది.

ఈ ఘటన 2018 ఫిబ్రవరిలో జరగగా, అప్పట్లో చిట్యాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం 2022 నుంచి ఈ కేసుపై నల్గొండ పోక్సో కోర్టులో విచారణ కొనసాగుతోంది. సోమవారం ఈ కేసుపై తీర్పు వెలువరించిన పోక్సో కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి రోజారమణి, దోషికి జైలు శిక్షతో పాటు బాధితురాలి కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories