నల్గొండ జిల్లా మర్రిగూడలో పత్తి రైతుల నిరసన

నల్గొండ జిల్లా మర్రిగూడలోని ఓ ఆగ్రో పత్తి మిల్లు ఎదుట పత్తి రైతులు నిరసన చేపట్టారు.

Arun Chilukuri
Published on: 4 Nov 2025 4:06 PM IST
నల్గొండ జిల్లా మర్రిగూడలో పత్తి రైతుల నిరసన
X

నల్గొండ జిల్లా మర్రిగూడలోని ఓ ఆగ్రో పత్తి మిల్లు ఎదుట పత్తి రైతులు నిరసన చేపట్టారు. కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలిచ్చిన పట్టించుకోకుండా మిల్లు యజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తికి సరైన ధర ఇవ్వడం లేదన్నారు. కలెక్టర్ ఇప్పటికే రైతుల పట్ల న్యాయం చేయాలని, మిల్లులు నిర్ణీత ధరలకు కొనుగోలు చేయాలని ఆదేశించారు. కానీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లులపై చర్యలు తీసుకొని పత్తికి సరైన ధర కల్పించి ఆదుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story