Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌ గేట్లు ఎత్తివేత

Nagarjuna Sagar Dam: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ కు భారీగా ఇన్ ఫ్లో రావడంతో నీటిమట్టం గణనీయంగా పెరిగింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 5 Aug 2024 12:37 PM IST
Nagarjuna Sagar Project Crest Gates Lifted
X

Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌ గేట్లు ఎత్తివేత

Nagarjuna Sagar: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ కు భారీగా ఇన్ ఫ్లో రావడంతో నీటిమట్టం గణనీయంగా పెరిగింది.. దీంతో సాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తారు. కృష్ణమ్మకు ఎస్‌ఈ నాగేశ్వరరావు, సీఈ అనిల్‌కుమార్‌ జలహారతి ఇచ్చి నీటిని దిగువకు విడుదల చేశారు. తొలుత దిగువ ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం మూడుసార్లు సైరన్‌ మోగించారు.

అనంతరం ఒక్కొక్కటిగా ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం నుంచి సాగర్‌లోకి భారీగా వరద పోటెత్తుతోంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ఇప్పటికే 580 అడుగులు దాటింది. దీంతో.. 6 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story