Nagarjuna Sagar Project: నాగార్జున సాగర్ 20 గేట్లు ఎత్తిన అధికారులు..

Nagarjuna Sagar Project: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది.

Arun Chilukuri
Published on: 30 Oct 2025 2:32 PM IST
Nagarjuna Sagar Project: నాగార్జున సాగర్ 20 గేట్లు ఎత్తిన అధికారులు..
X

Nagarjuna Sagar Project: నాగార్జున సాగర్ 20 గేట్లు ఎత్తిన అధికారులు.. 

Nagarjuna Sagar Project: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ఎగువ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మరోసారి సాగర్‌లోకి పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. వరద ఉధృతి పెరగడంతో అధికారులు 20 గేట్లను ఎత్తి.. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 590అడుగులుగా నమోదైంది.

ప్రాజెక్ట్ నీటిసామర్థ్యం 312 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 312 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి వరద ఉధృతి పెరగడంతో.. ఇన్‌ఫ్లో 3లక్షల 6వేల 62 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో అదే మోతాదులో కొనసాగుతోంది. స్పిల్‌వే గేట్ల ద్వారా 2లక్షల 72వేల 608 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story